Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూఫ్ టాప్ లే హెలీప్యాడ్ లు

Air Taxi Rooftop Helipads Proposed by CII
Advertisement
  • ఎయిర్ ట్యాక్సీల నిర్వహణ సులభంగా మార్చే యోచన
  • టేకాఫ్‌-ల్యాండింగ్‌ కు రూఫ్‌ టాప్‌ లను ఉపయోగించవచ్చు..
  • భారత పరిశ్రమల సమాఖ్య నివేదిక
  • ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వివరణ
Advertisement
నగరాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు ఎయిర్ ట్యాక్సీలతో చెక్ పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న, తేలిక పాటి హెలికాప్టర్లను ఎయిర్ ట్యాక్సీలుగా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, వీటికి టేకాఫ్, ల్యాండింగ్ సమస్యగా మారనుంది. దీనికి చెక్ పెట్టేందుకు భవనాల పైకప్పులను (రూఫ్‌ టాప్స్‌) ఉపయోగించవచ్చని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలిపింది.

నగరాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, రవాణా సమయాన్ని తగ్గించేందుకు ఎయిర్ ట్యాక్సీలు తోడ్పడతాయని పేర్కొంది. ఈమేరకు ‘నావిగేటింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ మొబిలిటీ ఇన్‌ ఇండియా’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్, కొత్తగా రాబోతున్న జెవార్‌ గేట్‌వేను కలిపే 65-75 కిలోమీటర్ల కారిడార్‌ను నమూనాగా తీసుకుని మన దేశంలో ఏఏఎం సాధ్యాసాధ్యాలను ఈ నివేదిక అంచనా వేసింది.

అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ మొబిలిటీ వ్యవస్థలో ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేక్‌ ఆఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్‌ ట్యాక్సీలు అభివృద్ధి చెందుతున్నాయి. వీటి టేకాఫ్‌, ల్యాండింగ్‌ లకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల పైకప్పులను ఉపయోగించుకోవడం ద్వారా మౌలిక సదుపాయాల కొరతను నివారించవచ్చని పేర్కొంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీల రాకపోకలకు నివాస భవనాలతో పాటు ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఐటీ టవర్లను ఉపయోగించుకోవచ్చని సీఐఐ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం రూఫ్ టాప్ ల నుంచి సాధారణ వాణిజ్య వర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ లకు అనుమతి లేదని గుర్తుచేసింది. ముందుగా ఈ నిబంధనలను సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
Advertisement
Advertisement
Rooftop Helipad
Air Taxi
CII
Air Mobility India
Electric Vertical Takeoff Landing
EVTOL
Gurugram
Jewar Airport
Traffic Congestion
Urban Transportation

More Telugu News